Venkatesh: ఆట కదరా శివ, మిస్ మ్యాచ్ వంటి డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యువ హీరో ఉదయ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గురు పవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఉదయ్ సరసన జెన్నిఫర్ ఇమ్మానుయేల్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. యువతకు నచ్చే కథాంశంతో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ట్రైలర్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఈసినిమా లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది. ఉదయ్ శంకర్ కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాను. టీం కి నా బెస్ట్ విషెష్” అన్నారు. ఇక హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ “విక్టరీ వెంకటేష్ గారు మా ట్రైలర్ ని లాంఛ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒక రోజు జరిగే కథ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. దోస్తీ సాంగ్.. ఎర్రతోలు పిల్ల సాంగ్స్ కి బాగా రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. వెంకటేష్ గారు ట్రైలర్ ని చూసి మా టీం ని అభినందించడం మాకు కొత్త ఎనర్జీని ఇచ్చిందని” చప్పుకొచ్చాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.