ధనుష్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. చాలా కాలం తర్వాత తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ధనుష్ విజయంలో కీలక పాత్ర పోషించారు సెల్వరాఘవన్. ‘తుల్లువదో ఇళమై’, ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి కలయికలో వచ్చాయి. ఇప్పుడు ధనుష్ తో ‘అసురన్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు తీసిన వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్ థాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమా శనివారం ఆరంభం అయింది. ‘నానే వరువేన్’ పేరుతో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను పూజ రోజునే విడుదల చేశారు. ఇందులో ధనుష్ కౌబాయ్ గెటప్ లో కనిపించటం విశేషం. ఇందులో ఇందుజా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది.