కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “మారన్” మరోసారి వార్తల్లో నిలిచింది. ‘మారన్’ చిత్రం నేరుగా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో మార్చి 11న విడుదల కానుంది. సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్‌పై కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ధనుష్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. స్మృతి వెంకట్, మాస్టర్ మహేంద్రన్, బోస్ వెంకట్, పాండా ప్రశాంత్ కూడా ఈ చిత్ర తారాగణంలో భాగం అవుతున్నారు. ఇటీవల ఈ చిత్రం…
యువ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మారన్’. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, స్మృతి వెంకట్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ పనులు జరుగుతున్నాయి. ‘ధ్రువ పదహారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కార్తీక్ నరేన్ ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో ఈరోజు అద్వితీయమైన థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కిస్తున్న…
ధనుష్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయింది. చాలా కాలం తర్వాత తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో ధనుష్ విజయంలో కీలక పాత్ర పోషించారు సెల్వరాఘవన్. ‘తుల్లువదో ఇళమై’, ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి కలయికలో వచ్చాయి. ఇప్పుడు ధనుష్ తో ‘అసురన్’, ‘కర్ణన్’ వంటి సినిమాలు తీసిన వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్ థాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరో సినిమా మొదలు పెట్టారు.…
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ స్టార్ ధనుష్ ఇటీవల “జగమే తందిరం” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆయన అభిమానులను బాగానే అలరించింది. ప్రస్తుతం “ది గ్రే మ్యాన్” అనే హాలీవుడ్ మూవీ చిత్రీకరణలో ఉన్న ఈ యంగ్ హీరో మరో రెండు వారాల్లో చెన్నైకి తిరిగి వస్తాడు. అతను చెన్నైకి తిరిగి వచ్చాక స్వల్ప విరామం తీసుకుని తన నెక్స్ట్ మూవీ “నానే వరువెన్” చిత్రీకరణ ప్రారంభిస్తాడు. తాజాగా “”నానే…