తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా వెంకట్ వందెల దర్శకత్వంలో ముల్లేటి కమలాక్షి, గుబ్బల వేంకటేశ్వరావు నిర్మించిన చిత్రం ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’. ఈ నెల 19న విడుదల కావాల్సిన ఈ సినిమాను సెప్టెంబర్ 2కు వాయిదా వేశారు నిర్మాతలు. ఈ మూవీ గురించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరావు చెబుతూ, ”ఈ చిత్రం నుండి విడుదల చేసిన ‘నిలదీస్తుందా…’ అంటూ సాగే విరహ గీతంతో పాటు అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. పల్లెటూరి నేపధ్యం లో సాగే ఈ చక్కటి ప్రేమకథలో యూత్ కు కావాల్సిన వినోదాన్ని మిక్స్ చేసి దర్శకుడు సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతోంది. చాలా ఆరోగ్యకర వాతావరణం నెలకొంది. మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మా సినిమా కూడా అదే కోవకు చెందింది. సెప్టెంబర్ 2న మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో త్వరలోనే ట్రైలర్ ను విడుదల చేస్తాం” అని అన్నారు.
