Naa Saami Ranga Trailer: సంక్రాంతి సినిమాల జోరు మొదలయ్యింది. ఈసారి నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయి. ఇప్పటికే గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్.. తమ ట్రైలర్స్ వదిలి హైప్ ను పెంచేశాయి. ఇక లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్నట్లు నాగార్జున కూడా ట్రైలర్ తో దిగిపోయాడు. అక్కినేని నాగార్జున, హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నా సామీ రంగ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన.. పోరింజు మరియమ్ జోస్ చిత్రానికి రీమేక్ గా నా సామీ రంగ తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను చూస్తుంటే.. పర్ఫెక్ట్ పండగ సినిమాలా కనిపిస్తుంది.
“కిష్టయ్యను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా.. అసలు అంతో అల్లరి నరేష్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఏజ్ గ్యాప్ ఉన్న ముగ్గురు స్నేహితులు.. వారి మధ్య బాండింగ్.. లవ్ చూపించారు. ఇక ఆ ఊరిలో కిష్టయ్య చెప్పిందే వేదంగా చూపించారు. అయితే కిష్టయ్య సింగిల్ గా ఉండడం, అతని వెనుక తిరిగే హీరోయిన్ ను చూపించారు. అయితే జాతర కారణంగా రెండు ఊర్ల మధ్య వైరం.. కిష్టయ్యను చంపడానికి ప్లాన్ చేసినట్లు చూపించారు. మరి ఆ జాతరను కిష్టయ్య జరిపించాడా .. ? అతను పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండిపోయాడు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నాగ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. చివర్లో బీడిని.. గునపంతో అంటించే షాట్ హైలైట్ గా నిలిచింది. ఇక కీరవాణీ మ్యూజిక్ నెక్ట్ లెవెల్..మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.