Ajith: టాలీవుడ్ లో స్టార్ ప్రొడక్షన్ హౌస్స్ లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. పుష్ప నేషనల్ అవార్డు అందుకోవడంతో ఈ ప్రొడక్షన్ హౌస్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు అందుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలన్నీ మైత్రి చేతిలోనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ నేషనల్ గుర్తింపు రావడంతో మైత్రి తన సామ్రాజ్యాన్ని విస్తరించాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది. ఇక దిల్ రాజు ఇప్పటికే ఇలాంటి ప్లాన్ వేశాడు. టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న అయన .. కోలీవుడ్ లో కూడా పాగా వేయాలని.. విజయ్ తో కలిసి వారసుడు తెరకెక్కించాడు. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేదు. ఇక ఇప్పుడు మైత్రి కూడా దిల్ రోజునే ఫాలో అవుతుందని అంటున్నారు. ఇప్పటికే మలయాళంలో ఒక సినిమా చేస్తున్నా మైత్రి.. తాజాగా కోలీవుడ్లో అడుగు పెట్టాలని చూస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రాసెస్ గత కొన్ని రోజులుగా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
HaromHara: స్టార్ హీరోలు దిగుతున్నారు.. సుధీర్ బాబు ఈసారైనా హిట్ కొడతాడా.. ?
ఇక అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో మైత్రి ఒక సినిమా ఫైనలైజ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు మార్క్ ఆంటోనీ తో హిట్ అందుకున్న డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడని టాక్ నడుస్తోంది. అయితే తాజాగా అధిక్ ప్లేస్ లో గోపీచంద్ మలినేని వచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్.. రవితేజతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పట్టాలెక్కకముందే.. అజిత్ తో కూడా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. అయితే అజిత్ ఈ సినిమాను ఓకే చేశాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు.. విజయ్ తో ఎంట్రీ ఇస్తే .. మైత్రి.. అజిత్ తో ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.