బెంచ్‌మార్క్ స్టూడియోస్‌లో బ్యానర్ లో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నెక్స్ట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే ఆసక్తికర టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో సడన్ గా సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజెక్ట్‌కి సపోర్ట్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు తదుపరి స్థాయికి చేరుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ తమతో జాయిన్ అవ్వడం పట్ల చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా నిర్మాణ వ్యవహారంలో భాగస్వామి కాబోతోందని స్పష్టం చేసింది.
ఇక త్వరలోనే “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తామని మేకర్స్ ఈ వీడియో ద్వారా ప్రకటించారు. అంతేకాదు సినిమా విడుదల తేదీని కూడా అనౌన్స్ చేయనున్నారు. విలక్షణమైన ప్రేమ కథతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రోపొందుతున్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పి.జి.విందా కెమెరా, వివేక్ సాగర్ సంగీత విభాగాలను చూసుకుంటున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగం కావడంతో హైప్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.