Poorna: శ్రీ మహాలక్ష్మి సినిమాతో ఎలుగుతెరకు పరిచయమైన బ్యూటీ పూర్ణ. కేరళ ముస్లిం అయినా కూడా అచ్చతెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది. సీమ టపాకాయ్, అవును, అవును 2 లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. ఇంకోపక్క బుల్లితెర డ్యాన్స్ షోస్ లలో జడ్జిగా మారి మరింత ఫేమస్ అయ్యింది. 2002 లో పెళ్లి చేసుకున్న పూర్ణ ప్రస్తుతం సినిమాలను ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ లో మెరిసి షేక్ చేసింది. ఇక ఈ భామ కోలీవుడ్ లో ఒక సినిమా చేస్తుంది.. అదే డెవిల్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ తమ్ముడు ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హెచ్ పిక్చర్స్ హరి, టచ్ స్క్రీన్ జ్ఞానశేఖర్ కలిసి నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొట్ట మొదటిసారి మిస్కిన్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. ఇక తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో మిస్కిన్ బోల్డ్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారాయి.
” డెవిల్ సినిమా మీ అందరికి నచ్చుతుంది. ఈ సినిమా కోసం ఆదిత్య ఎంతో కష్టపడ్డాడు. నేను తమ్ముడు సినిమా అని, ప్రమోషన్స్ చేస్తున్నాను.. సపోర్ట్ చేస్తున్నాను అని అంటున్నారు. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. కథ బావుంటే ఎవరి సినిమాకు అయినా సపోర్ట్ ఉంటుంది. పూర్ణ ఈ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక ఈ సినిమా చేసే సమయంలో నాకు, పూర్ణకు ఎఫైర్ ఉందని వార్తలు రాసుకొచ్చారు. అది మరింత బాధను కలిగించింది. ఆమె నాకు తల్లిలాంటింది. వచ్చే జన్మలో ఆమెకు బిడ్డగా పుట్టాలనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.