ఎన్టీవీ ఎంటర్ టైన్మెంట్… తన పేరుకు తగ్గట్టే వీక్షకులకు హండ్రెడ్ పర్సంట్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తోంది. నయా సాల్ లో ‘మ్యూజిక్ ఎన్ ప్లే’ ప్రోగ్రామ్ తో ఇది రెట్టింపు అయ్యింది. పాపులర్ సింగర్ సాకేత్ కొమాండూరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘మ్యూజిక్ ఎన్ ప్లే’ కార్యక్రమం లాస్ట్ సండే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. ఎస్. తమన్ తో శుభారంభమైంది. ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ లో ప్రసారం కావడం ఆలస్యం… ఈ ఎపిసోడ్ బ్లాస్ట్ అయ్యింది! పాటలు, ఆటలతో సాగిన ఈ ఫన్ అండ్ మ్యూజిక్ ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ తోనే సూపర్ డూపర్ హిట్ అయిపోయి అందరి అంచనాలనూ పెంచేసింది.
దాంతో ఇప్పుడు ‘తగ్గేదే లే’ అన్నట్టుగా సెకండ్ ఎపిసోడ్ నూ సాకేత్ కొమాండూరి సూపర్ ఎగ్జయిట్ క్రియేట్ అయ్యేలా తయారు చేశారు. ఈ సెకండ్ ఎపిసోడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ గీతా మాధురి, పర్ణిక మాన్య పాల్గొనడం విశేషం. స్పాండేనియస్ గా కౌంటర్స్ వేయడంలో దిట్ట అయిన గీతా మాధురి వర్సెస్ సాకేత్ కొమాండూరి మధ్య జరిగిన రచ్చ రంబోలాకు ఈ సెకండ్ ఎపిసోడ్ నిదర్శనం. ఇక పర్ణిక మాన్య సైతం తనదైన ఆటపాటలతో వీక్షకులను సూపర్ గా ఆకట్టుకుంది. ఈ రోజే సెకండ్ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. అయితే అంతవరకూ ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేసేయండి.