మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా పాటలను ప్రత్యేకంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లీకుల సమస్య మేకర్స్ ను తలలు పట్టుకునేలా చేస్తోంది. సినిమా నుంచి ‘కళావతి’ అనే మొదటి పాట ఈ ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉంది. ఈ పాటకు సంబంధించి విడుదలైన చిన్న ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈఅయితే అనూహ్యరీతిలో నిన్న ‘కళావతి’ మొత్తం పాట ఆన్‌లైన్‌లో లీక్ అయ్యింది. దీంతో “సర్కారు వారి పాట”టీంతో పాటు మహేష్ అభిమానులు కూడా షాక్ అయ్యారు. ఇక ఆ సాంగ్ ను కంపోజ్ చేసిన తమన్ గుండె పగిలిపోయింది అంటూ సాంగ్ లీక్ కావడంపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఈ పాటకు ఎంతో మంది టాప్ టెక్నీషియన్లు పని చేశారని, పైరసీ అవడం తన మనసును బద్దలు కొట్టిందని ఆడియో నోట్‌లో చాలా ఎమోషనల్‌గా చెప్పాడు.
Read Also : Leak : “సర్కారు వారి పాట” టీమ్ కు షాక్… సాంగ్ లీక్
“రాత్రి పగలు తేడా లేకుండా, కరోనా ఉన్నప్పటికీ 6 నెలల పాటు కష్టపడ్డాము. ఈ సాంగ్ షూటింగ్ చేసినప్పుడు 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎంతోమంది కష్టం ఈ సాంగ్… నిర్మాత పెట్టుబడి, మా పాటలో ఉండే ప్రాణం, మా కవి రాసిన లిరిక్స్, మేము మా హీరోకు చూపించాల్సిన ప్రేమ, మా దర్శకుడు సంతోషంగా చేసిన లిరికాల్ వీడియో… ఇక ప్రపంచంలోనే మాస్టర్ మిక్సింగ్ టెక్నాలజీని వాడాము. ఎవడో ఎంతో ఈజీగా ఈ సాంగ్ ను లీక్ చేసి మా కష్టాన్ని నాశనం చేశాడు… వాడికి పనిస్తే ఇలాంటి పని చేశాడు” అంటూ తమన్ చెప్పిన హార్ట్ బ్రేకింగ్ వర్డ్స్ చూస్తే ఈ సాంగ్ లీక్ వల్ల ఆయన ఎంత బాధ పడుతున్నారో తెలుస్తోంది.
Heartbroken 💔 !! pic.twitter.com/tO75lsUND6
— thaman S (@MusicThaman) February 12, 2022
— thaman S (@MusicThaman) February 12, 2022