Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఫుల్ హీరోగా ఎంతైతే పేరు తెచ్చుకున్నాడో ఫ్యాషన్ ఐకాన్ గా కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు. ఎవరు ఏం అనుకుంటారు అనేది చూడకుండా ఎలాంటి డ్రెస్ అయినా వేసుకొని షాక్ ఇస్తాడు. ఇక ఇటీవలే ఒక మ్యాగజైన్ కోసం న్యూడ్ గా కూడా కనిపించాడు. ఆ న్యూడ్ ఫోటో షూట్ వివాదమే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ ఫోటోషూట్ పై చాలామంది అతడిని విమర్శించారు.
మరికొందరు కేసులు కూడా పెట్టారు. ఇక ఈ కేసులపై ముంబై పోలీసులు విచారణ జరపడానికి ఇటీవలే రణ్ వీర్ సింగ్ ఇంటికి వెళ్లగా అతను లేకపోవడంతో వెనుతిరిగారు. ఇక నేడు షూటింగ్ ముగించుకొని వచ్చిన రణ్ వీర్ ముంబై పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై పోలీసులు రణ్ వీర్ వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అవసరముంటే మళ్లీ పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పినట్లు సమాచారం. ఇక ఈ విషయమై ఇప్పటివరకు రణ్ వీర్ కానీ అతని భార్య దీపికా పదుకొనే కానీ స్పందించింది లేదు. ఇవేమి పట్టించుకోకుండా ఇద్దరు తమ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. మరి ఈసారైనా రణ్ వీర్ ఈ విషయమై నోరు విప్పుతాడేమో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం రణ్ వీర్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండగా.. దీపికా, షారుక్ సరసన పఠాన్ లో నటిస్తోంది.