కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇండియాలో మెల్ల మెల్లగా సాధారణ వాతావరణం నెలకొంటోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్లన్నీ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షక ఆదరణ కూడా బాగుంది. దీనిని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా థియేటర్లను ఓపెన్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆ బాటలో మహారాష్టలో ఈ నెల 22 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సంస్థ ఐనాక్స్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 22న మూవీ లవర్స్ కి అన్ కండిషనల్ సపోర్ట్ అంటూ ఉదయం 9 నుంచి రాత్రి 10 వరకూ మహారాష్ట అంతటా తమ గ్రూప్ థియేటర్స్ లో సినిమాలు ఫ్రీగా చూడవచ్చని ప్రకటించింది. అయితే టికెట్ బుక్ చేసుకునే వారికి ఓ బుకింగ్ లో రెండు టిక్కెట్స్ కి మాత్రమే అవకాశం అట. మరి ఈ ఆఫర్ తో నైనా ఆడియన్స్ థియేటర్ల బాట పడతారేమో చూడాలి.