నాలుగేళ్ల నుండి వరుస ప్లాపులతో సతమతమౌతున్న టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హోప్స్ అన్నీ రాబిన్ హుడ్‌పై పెట్టుకున్నాడు. భీష్మ తర్వాత చేసిన చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో మరోసారి హిట్ డైరెక్టర్ వెంకీ కుడుమలను నమ్మి రాబిన్ హుడ్ అనే సినిమా చేసాడు. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు నితిన్. కానీ ఈ సినిమా తోలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. నితిన్ ఖాతాలో మరో ప్లాప్ వచ్చి చేరింది.
Also Read : RaashiiKhanna : ‘రాశీఖన్నా’ .. ఆ బికినీ ఫోజులేంటి రా బుజ్జికన్నా
ఇప్పుడు నితిన్ ఆశలన్నీ తమ్ముడు సినిమాపైనే. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా ఊహించిన దాని కంటే కొత్తగా ఉంటుందని అసలు ఊహించలేరని ఆ మధ్య రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లో నితిన్ తెలిపాడు. ఇప్పటికే అరడజనుకు పైగా ప్లాప్స్ అందించిన నితిన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని తమ్ముడు సినిమాపై జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను మే లో రిలీజ్ చేయాలని భావించినప్పటికి వాయిదా వేశారు. లేటెస్ట్ గా జులై 4న తమ్మడు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. కనీసం తమ్ముడు తో అయిన నితిన్ ప్లాప్ ల పరంపరకు అడ్డుకట్ట వేసి హిట్ ట్రాక్ ఎక్కుతాడెమో చూడాలి.