Monica Bedi: ఆ హీరో.. రా.. అనగానే వెళ్లి ఉంటే.. అవకాశం వచ్చేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monica Bedi: టాలీవుడ్ క్లాసిక్ మూవీ తాజమహల్ సినిమా గుర్తుందా.. ? శ్రీకాంత్ హీరోగా నటించిన ఈచిత్రంతోనే బాలీవుడ్ నటి మోనికా బేడీ తెలుగుతెరకు పరిచయమైంది. అందమే అసూయ పడుతుందా అనేంత ఆమె అందం అభిమానులను మంత్రం ముగ్దులను చేసింది. ఈ సినిమా తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే.. అమ్మడికి మాత్రం ఆశించిన ఫలితం మాత్రం అందుకోలేకపోయింది. దీంతో మోనికా బాలీవుడ్ కే పరిమితమయ్యింది. ఇక ఆ తరువాత చాలా వివాదాల వలన ఫేమస్ అయిన ఆమె.. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని మెప్పించింది. అయితే కెరీర్ మొదట్లో తాను చేసిన తప్పు వలన మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ” మొదటి సారి దర్శకుడు సుభాష్ ఘై హోలీ పార్టీకి వెళ్ళాను. అక్కడ రాకేష్ రోషన్ నన్ను చూసి మాట్లాడాడు. ఆయన ఒక నటుడు అని తెలుసు కానీ, డైరెక్టర్, నిర్మాత అన్న విషయం నాకు తెలియదు. అయితే పార్టీ మొత్తం అయ్యాకా.. ఆయన విజిటింగ్ కార్డు నా చేతికి ఇచ్చి రేపు ఆఫీస్ కు రా అని చెప్పాడు.
Rashmika: రష్మిక వెనుక కుట్ర.. అతడే చేయిస్తున్నాడా..?
Also Read
- Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
- Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్' సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
- Hero - Director : హిట్స్ కోసం కొత్త రూట్ వెతుకుతున్న హీరోలు, దర్శకులు
- Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
ఇక దీంతో నేను ఈయనేంటి.. నన్ను రమ్మంటున్నాడు అని అనుకోని.. విజిటింగ్ కార్డును చింపి ముక్కలు చేశాను. ఆ తరువాత కొన్నిరోజులు నా మేనేజర్ వచ్చి.. రాకేష్ రోషన్ ఆఫీస్ కు రమ్మంటే వెళ్ళలేదు అంట .. ఎందుకు అని అడిగాడు. అతను నటుడు అని మాత్రమే తెలుసు.. నిర్మాత అని తెలియదు చెప్పాను. అతడు కరణ్ అర్జున్ సినిమా తీస్తున్నాడు. అందులో సల్మాన్ సరసన నీకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడానికి పిలిచాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పాత్రలో మమతా కులకర్ణిని తీసుకున్నారు అని చెప్పాడు. నేను షాక్ అయ్యాను. ఆయన రా అనగానే వెళ్లి ఉంటే మంచి అవకాశాన్ని అందుకొనేదాన్ని. ఇక మరోసారి .. ఒక సినిమా ఒప్పుకుని.. ఆ సినిమా పూర్తి అయ్యేవరకు మరో సినిమా చేయను అని బాండ్ రాశాను. దానివలన చాలా మంచి అవకాశాలు పోయాయి. ఎన్ని అవకాశాలు వదులుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వలన సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదు. అలా ఏడాదిన్నర ఖాళీగా ఉన్నాను.. ఇది అతడి తప్పు కాదు. కొన్ని సార్లు మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగవంతే” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?