Rashmika: నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే యానిమల్ సినిమాను ఫినిష్ చేసిన రష్మిక పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలు కాకుండా రష్మిక .. భీష్మ కాంబోలో ఒక సినిమా చేయనుంది. నితిన్- వెంకీ కుడుముల- రష్మిక కాంబోలో తెరకెక్కిన భీష్మ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కాంబో మరోసారి రీపీట్ అవుతుందని VNRTrio పేరుతో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకుంది. ఈ విషయాన్నీ ఆమె అధికారికంగా తెలిపింది. రష్మిక తనకున్న సినిమాల వలన డేట్స్ అడ్జస్ట్ కావడంలేదని, అందుకే తాను సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిపింది.
Faria Abdullah : చీరలో కొంటె చూపులతో కవ్విస్తున్న చిట్టి..
ఇకపోతే ఈ సినిమా విషయంలో రష్మిక వెనుక కుట్ర జరిగిందని సోషల్ మీడియా టాక్. గత కొన్నిరోజుల క్రితం.. రష్మికకు అతడి మేనేజర్ కు గొడవ జరిగిన విషయం తెల్సిందే. మేనేజర్.. రష్మికకు తెలియకుండా 50 లక్షలు వాడుకున్నాడని, ఆ విషయం తెలిసి ఆమె.. అతడిని పనిలో నుంచి తీసేసిందని టాక్ నడిచింది. ఇక ఈ వార్తలు రష్మిక వరకు వెళ్లడంతో.. ఈ వార్తలో నిజం లేదని, తామే ప్రొఫెషనల్ గా విడిపోయామని చెప్పుకొచ్చింది. అయితే అదంతా మనసులో పెట్టుకొని సదురు మేనేజర్ రష్మికపై కుట్ర పన్నుతున్నాడట. నితిన్ సినిమాలో రష్మికకు అవకాశం చేజారడానికి కారణం కూడా అతనే అని అంటున్నారు. ఆమెకు తెలుగులో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని, బాలీవుడ్ లో సెటిల్ అవ్వాల ని చూస్తోంది అంటూ ప్రచారం చేశాడట. రష్మిక కు బదులు గా శ్రీలీల, మృణాల్ ని తీసుకోవాలని కూడా అతనే సూచించాడట. అతని మాట వినే మేకర్స్ రష్మిక ప్లేస్ లో శ్రీలీల ను తీసుకున్నారని తెలుస్తోంది.మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే రష్మిక అధికారికంగా చెప్పేవరకు ఆగాల్సిందే.