Mohanlal : మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లూసీఫర్-2. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. మార్చి 27న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ నటించేందుకు ఎన్ని కోట్లు తీసుకున్నాడనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం మోహన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.
Read Also : SRH vs RR: రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ ప్లేయర్స్.. సన్‌రైజర్స్ భారీ స్కోర్..
‘మామూలుగా సినిమా అంటే వంద కోట్ల బడ్జెట్ అనుకుంటే అందులో రూ.80 కోట్ల దాకా రెమ్యునరేషన్లకే పోతోంది. కేవలం రూ.20 కోట్లు మాత్రమే సినిమా తీయడానికి ఖర్చు చేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎల్-2తో మేము ఓ ప్రయోగం చేయబోతున్నాం. ఈ సినిమాతో మా ఇంటెన్షన్ ఏంటనేది అందరికీ తెలిసిపోతుంది. అందుకే టెక్నీషియన్లు, యాక్టర్లు ఈ సినిమా కోసం సహకరించారు’ అంటూ చెప్పుకొచ్చాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన చేసిన తాజా కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మూవీ ఫుల్ యాక్షన్ మోడ్ లో వస్తోంది.