Mammootty : మళయాల మెగాస్టార్ మమ్ముట్టి గురించి ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయన ఆరోగ్యం గురించి ఈ నడుమ ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మమ్ముట్టి క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహన్ లాల్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. మమ్ముట్టి, మోహన్ లాల్ నడుమ ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఎల్2.. ఎంపురాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రమోషన్లు స్టార్ట్ చేశారు.
read also : Murder: భర్తను15 ముక్కలుగా నరికి.. సిమెంట్‌తో డ్రమ్ములో సీల్ చేసి ప్రియుడితో జంప్
ఇందులో భాగంగా శబరిమల ఆలయాన్ని మోహన్ లాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అక్కడ మమ్ముట్టి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక మమ్ముట్టి నటించిన ఎల్ 2 ఇప్పటికే అంచనాలు పెంచేసింది. ఈ మూవీని పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశారు. ఇందులో చాలా మంది కీలక పాత్రలు చేశారు. పూర్తి యాక్షన్ సినిమాగా రాబోతోంది. మొదటి పార్టు హిట్ అయింది కాబట్టి ఈ సీక్వెల్ పై మంచి అంచనాలు ఉన్నాయి.