కంప్లీట్ యాక్టర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘మలైకొట్టే వలిబన్’. 2024 జనవరి 25న రిలీజ్ కానున్న ఈ సినిమాని లిజో జొస్ పెల్లిసరి డైరెక్ట్ చేస్తున్నాడు. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన జల్లికట్టు సినిమాని డైరెక్ట్ చేసిన లీజో జోస్ పెల్లిసరీని మోహన్ లాల్ పిలిచి మరీ సినిమా ఇచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలనే చేస్తున్న మోహన్ లాల్, చేంజ్ ఓవర్ కోసమే లిజోతో సినిమా చేస్తున్నాడు. న్యూ ఏజ్ డైరెక్టర్ మోహన్ లాల్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడో అనే ఆలోచన మలయాళ సినీ అభిమానుల్లో ఉంది. ఒక మాస్టర్ పీస్ సినిమా చూడబోతున్నాం అనే గట్ ఫీలింగ్ లోకి వచ్చేసారు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తోనే ప్రేక్షకుల్లో భారి అంచనాలు క్రియేట్ చేసిన మలైకొట్టై వలిబన్ టీజర్ రిలీజ్ అయ్యింది.
మాలైకొట్టై కి చెందిన యువకుడు అనే అర్ధం వచ్చే టైటిల్ తో తెరకెక్కిన సినిమా నుంచి వచ్చి టీజర్ యూట్యూబ్ లో 24 గంటలు తిరగకుండానే 6 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. ఈ సినిమాలో మోహన్ లాల్ రెజ్లర్ గా కనిపించానున్నాడు… టీజర్ లో కూడా మోహన్ లాల్ కంప్లీట్ కొత్త లుక్ లో కనిపించాడు. అయితే నిమిషమున్నర నిడివితో కట్ చేసిన టీజర్ లో మోహన్ లాల్ కి సంబంధించిన ఒక్క సీక్వెన్స్ మాత్రమే ఉంది. ఇది తప్ప టీజర్ లో ఇంకొకటి లేదు… “కళ్లతో చూసిందే నిజం, చూడనిదంతా అబద్దం” అంటూ మోహన్ లాల్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్… మోహన్ లాల్ ఫేస్ రివీల్ చెయ్యడంతో ఎండ్ అయ్యింది. ఈ టీజర్ ని టాలీవుడ్ లో అయితే గ్లిమ్ప్స్ అంటారు, అంత చిన్నగా టీజర్ ని కట్ చేసారు. మలైకొట్టై వలిబన్ టీజర్ లో ప్రశాంత్ పిళ్ళై బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ మధు నీలకందన్ సినిమాటోగ్రఫి స్టాండ్ అవుట్ అయ్యాయి. కథని చెప్పకూడదు అనే ఉద్దేశంతో లిజో టీజర్ ని కట్ చేసాడనే విషయం అర్ధమవుతుంది. మరి ట్రైలర్ లో అయినా కాస్త కథని చెప్తాడేమో చూడాలి.
#MalaikottaiVaaliban Official Teaser https://t.co/LVjtY9nfNE#MalaikottaiVaalibanTeaser#VaalibanOnJan25
Malayalam | Tamil | Telugu | Hindi | Kannada@mrinvicible @shibu_babyjohn @achubabyjohn @mesonalee @danishsait @johnmaryctve #maxlab @saregamasouth @saregamaglobal… pic.twitter.com/ByRfXqC061
— Mohanlal (@Mohanlal) December 6, 2023