Miss. Shetty Mr. Polishetty: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అనుష్క ప్రస్తుతం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోగా నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. లేడీ లక్.. లేడీ లక్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రతి ప్రియుడు.. తన ప్రేయసి గురించి ఆలోచించే భావాలుగా ఈ సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. ఇక చెఫ్ గా అనుష్క, స్టాండప్ కమెడియన్ గా నవీన్ కనిపించారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు లిరిక్స్ అందించగా.. రాధన్ స్వరాలు సమకూర్చారు. కార్తీక్ ఆలపించారు.
NBK 109 : భారీ యాక్షన్ సీన్స్ తో మొదలు కానున్న బాలయ్య తరువాత సినిమా..?
ఇక జీవితంలో అసలు లక్ లేదు అనుకున్న కుర్రాడి జీవితంలోకి అమ్మాయి లక్ గా కలిసి వస్తే.. ఆ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు అనేది హీరో తో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇక లిరికల్ వీడియోలా కాకుండా వీడియో సాంగ్ మొత్తాన్ని రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు మేకర్స్. ఇక ఈ వీడియోలో అనుష్క మాత్రం హైలైట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ళ తరువాత అనుష్కను కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వీటీ ఎంతో అందంగా కనిపిస్తుంది. దీంతో అబ్బ.. అబ్బ.. స్వీటీని ఇలా చూసి ఎన్నిరోజులు అవుతుందో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో అనుష్క ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలంటే ఆగస్టు 4 వరకు ఆగాల్సిందే.