Durgesh : ఈ నడుమ టాలీవుడ్ ను ప్రోత్సహించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాయి. మొన్ననే తెలంగాణ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చేందుకు గద్దర్ అవార్డును ఇస్తామని ప్రకటించింది. తాజాగా ఏపీలోని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కూడా ఓ ప్రకటన చేశారు. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ భైరవం. మే 30న రిలీజ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. దీనికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆయన మాట్లాడుతూ ఏపీలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also : DC vs GT: సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
‘ఏపీలో షూటింగ్ లు ఇంకా జరగాలి. దానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఫిల్మ్ పాలసీని కూడా తీసుకువస్తున్నాం. త్వరలోనే ఇక్కడ సినిమాలు తెరకెక్కించడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తాం. ఏపీలో ఎప్పటి నుంచో మూలన పడిపోయిన నంది అవార్డులు కూడా త్వరలోనే ప్రకటిస్తాం. అతి త్వరలో మూవీ నిర్మాతలు, డైరెక్టర్లతో భేటీ అవుతాం. వారందరి సూచనల మేరకు ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటాం. ఏపీలో సినిమా పరిశ్రమను మరింత విస్తరించడమే మా బాధ్యత’ అని ఆయన తెలిపారు.
Read Also : Suriya -Venky:సూర్యతో ప్రేమలు బ్యూటీ.. రేపే పూజ!