తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై తో సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేల రాలుతున్నాయి. నదులు పొంగి పోలుతుండటంతో చాలా మంది నివాసాలు కోల్పోయారు. చివరకు రోడ్ల పై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మిచౌంగ్ దెబ్బకు చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది.
ఈ భారీవర్షాల కారణంగా 8 మంది మృతి చెందారని తెలుస్తోంది.. కొన్ని ప్రాంతాలకు ఇంకా రెడ్ అలెర్ట్ ను జారీ చేశారు.. చాలావరకు అన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి.. లోతట్టు ప్రాంతాలన్నీ నేటితో నిండిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో జనం పడరాని పట్లు పడుతున్నారు. మరోవైపు NDRF, SDRF బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉంటే వరద బాధితులను ఆదుకునేందుకు సినీ హీరో సూర్య ముందుకు వచ్చాడు..
హీరో సూర్య , అతని తమ్ముడు కార్తీ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ ఇద్దరు కలిసి 10లక్షల రూపాయిల ఆర్థిక సాయం అందించినట్టు తెలుస్తోంది. సూర్య ఇప్పటికే పలు సేవ కార్యక్రమాలు, ఆర్ధిక సహాయాలులాంటివి చేశారు. సూర్య సినిమాల విషయానికొస్తే.. కంగువ అనే భారీ పిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ షూటింగ్ శరవేగంగా జరిగుతోంది. ఈ ను ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కార్తీ జపాన్ సినిమాతో ప్రేక్షకులను పాలకరించాడు..