Michael Teaser: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, మరో కుర్ర హీరో వరుణ్ సందేశ్, అనసూయ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రంలో సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను తెలుగులో నాని, తమిళ్ లో ధనుష్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, కన్నడ లో రక్షిత్ శెట్టి, హిందీలో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్, రకుల్ ప్రీత్ సింగ్, రాజ్ అండ్ డికె ద్వయం రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఇక టీజర్ విషయానికొస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది.
“మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి”అని అయ్యప్ప శర్మ బేస్ వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. ఇందులో గౌతమ్ అవిటి గ్యాంగ్ స్టార్ లా కనిపించాడు. అతని వద్ద పనిచేసే కుర్రాడు మైఖేల్ అని తెలుస్తోంది. టీజర్ ను బట్టి ఈ కథ అంతా మాఫియా నేపథ్యంలో జరుగుతుందని అర్ధమవుతోంది. రెండు గ్రూప్ లు మధ్య యుద్ధం.. ఆధిపత్యం కోసం పోరులా కనిపిస్తోంది. అందులో బలైన కుర్రాడు మైఖేల్. ఈ గ్రూప్ లీడర్ గా విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కనిపించారు. సందీప్ తో తలపడే కుట్ర్రా డాన్ గా వరుణ్ సందేశ్ కనిపించాడు. యాక్షన్ తో పాటుగా తగినంత రొమాన్స్ కూడా ఉంటుందని సందీప్ కిషన్ – దివ్యాంశ కౌశిక్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక సందీప్ లుక్ అయితే టెర్రఫిక్ గా ఉందని చెప్పాలి. సిక్స్ ప్యాక్ బాడీతో అల్టిమేట్ లుక్ లో అదరగొట్టేశాడు. తనకు జరిగిన అన్యాయానికి మైఖేల్ రివెంజ్ తీర్చుకున్నట్లు కనిపించాడు. కథ మొత్తం రివీల్ చేయకుండా కేవలం పవర్ ఫుల్ డైలాగ్స్ తోనే టీజర్ పై ఆసక్తి పెంచేశారు. ఇక చివర్లో “మైఖేల్.. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం..” అని అయ్యప్ప శర్మ వాయిస్ ఓవర్ తో అంటుండగా..”నేను మనిషిగానే ఉంటాను మాస్టర్.. దేవుడు అవ్వాలనే ఆశ లేదు”అన్న డైలాగ్ సినిమా కథగా తెలుస్తోంది. ఇక శ్యామ్ సీఎస్ సంగీతం టీజర్ కు హైలైట్ గా నిలిచింది. మరి టీజర్ తోనే సెన్సేషన్ సృష్టించిన మైఖేల్ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.