ప్రస్తుతం ఎక్కడ చూసిన కెజిఎఫ్ 2 ఫీవర్ నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులను ఎన్నో అంచనాలు పెట్టుకున్న విషయం తెల్సిందే. అంచనాలకు తగ్గట్టుగానే కెజిఎఫ్ 2 పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కెజిఎఫ్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబో చాప్టర్ 2 తో కూడా హిట్ ను అందుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రంలో యష్ సరసన శ్రీనిధి శెట్టి నటించిన విషయం విదితమే.. వీరి మధ్య నడిచిన లవ్ ట్రాక్ సినిమాలో హైలైట్ గా నిలిచిందని ప్రేక్షకులు తెలుపుతున్నారు.
ఇక తాజాగా ఆ లవ్ ట్రాక్ ఆడియోను మేకర్స్ తాజాగా విడుదల చేసి ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. మెహబూబా అంటూ సాగిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్.. అనన్య భట్ మెస్మరైజింగ్ వాయిస్ మనసును హత్తుకుంటుంది. ఎలాంటి సమయంలోనైనా నీకు నేను తోడుగా ఉంటానని హీరోయిన్, హీరోకు భరోసా ఇస్తున్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక రవి బసూర్ సంగీతం ఈ పాటకే కాదు సినిమాకే హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
https://www.youtube.com/watch?v=V4omWx5yEZk