ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. మార్చ్ 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం చరణ్ US వెళ్లాడు. అక్కడ ABC (American Broadcasting Channel) ఛానెల్ నిర్వహించే బిగ్గెస్ట్ షో “గుడ్ మార్నింగ్ అమెరికా” షోలో పాల్గొడానికి చరణ్ కి ఆహ్వానం వచ్చింది. బుధవారం చరణ్, ఈ షోకి గెస్టుగా వెళ్లాడు. 1975 నుంచి సక్సస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోకి USలో మంచి డిమాండ్ ఉంది. మైఖేల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ టాక్ షోలో చరణ్ “ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి, రాజమౌళి గురించి, నాటు సాంగ్ నామినేట్ అవ్వడం గురించి…” ఇలా వేరియస్ టాపిక్స్ పైన ఇంటరెస్టింగ్ విషయాలని షేర్ చేసుకున్నాడు.
చరణ్ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో లింక్ ని పోస్ట్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని పంచుకున్నాడు. పుత్రోత్సాన్ని ఎంజాయ్ చేస్తున్న చిరు, చరణ్ ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొనడం దేశం గర్వించదగ్గ విషయం అంటూ ట్వీట్ చేశాడు. “A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world! Onwards & Upwards !!” అని కోట్ చేస్తూ చిరు చేసిన ట్వీట్ కి మెగా అభిమానులు “లైక్ ఫాదర్, లైక్ సన్”, “తండ్రిని మించిన తనయుడు” లాంటి కామెంట్స్ పెడుతూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.
A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica
Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world!
Onwards & Upwards !! 👏👏https://t.co/Ur25tvt9r9 pic.twitter.com/SrpisRfviK
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 23, 2023