ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్స్ కి నామినేట్ అయ్యింది. మార్చ్ 12న జరగనున్న ఈ ఈవెంట్ కోసం చరణ్ US వెళ్లాడు. అక్కడ ABC (American Broadcasting Channel) ఛానెల్ నిర్వహించే బిగ్గెస్ట్ షో “గుడ్ మార్నింగ్ అమెరికా” షోలో పాల్గొడానికి చరణ్ కి ఆహ్వానం వచ్చింది.…