విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా లైలా సినిమాను రూపొందించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
Also Read : RC 16 : రామ్ చరణ్ 16.. కథ, నేపథ్యం ఏంటో చేప్పేసిన డీవోపీ
కాకపోతే డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాత్రం కాస్త గట్టిగానే ఉన్నట్టున్నాయి. ఓవరాల్‌గా విశ్వక్ లేడీ గెటప్ మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఉంది. కాగా లైలా కోసం మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపుతున్నారు మేకర్స్. ఫిబ్రవరి 9న హైదరాబాద్‌లో లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్టుగా చిరంజీవిని తీసుకురానున్నారు. చిత్ర హీరో విశ్వక్ సేన్ నిర్మాత సాహు గారపాటి స్వయంగా వెళ్లి మెగాస్టార్ ను కలిసి లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా రావాలని కోరగా అందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో లేడి గెటప్ లో కనిపించేందుకు విశ్వక్ చాలా కష్టపడ్డాడు. సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్న విశ్వక్ సేన్ కు లైలా తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.