వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ మెగా లిస్ట్‌లో ఉన్నారు. బింబిసార డైరెక్టర్‌కు చిరు ఓకే చెప్పారనే న్యూస్ ఆ మధ్య తెగ వైరల్ అయింది. ప్రస్తుతం మల్లిడి వశిష్ట స్క్రిప్టు రెడీ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ‘బంగార్రాజు’ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ కురసాలతో చిరు ప్రాజెక్ట్ దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే. త్వరలోనే ఈ సినిమాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతున్నాయి. అయితే ఇప్పుడు.. ఊహించని డైరెక్టర్‌తో చిరు సినిమా చేసే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవలే మలయాళంలో వచ్చిన 2018 అనే సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 200 కోట్లు గ్రాస్‌తో సంచలన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాను జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూసిన చిరు.. డైరెక్టర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడట. దాంతో జూడ్ ఆంథోనీ జోసెఫ్, చిరంజీవిని కలిసినప్పుడు ఓ స్టోరీ లైన్‌ను కూడా వినిపించాడట. లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్టు రెడీ చేయమని చెప్పారట చిరంజీవి. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ఫుల్ స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నారట. ఈ సినిమా విశాఖపట్నం బ్యాగ్‌డ్రాప్‌తో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని టాక్. ఫైనల్‌గా చిరుకు స్క్రిప్టు నచ్చితే.. గీతా ఆర్ట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ ప్రాజెక్ట్‌ను కలిసి నిర్మించే అవకాశం ఉందని తెలిసింది. 2018 మూవీని వీళ్లే తెలుగులో డబ్బింగ్ చేశారు. అందుకే ఈ మెగా ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైనా.. ఈ ఊహించని కాంబినేషన్ ఒక్కసారిగా క్రేజీ హైప్‌ని తీసుకొచ్చింది.