మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ఉంది. చిరు కెరీర్ లో అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ జానర్ లో పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం విశ్వంభర మాత్రమే. పంచభూతాల ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి సాలిడ్ కంటెంట్ తో రెడీ అవుతున్న విశ్వంభర యాక్షన్ ఖోరియోగ్రఫీ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇటీవలే చిత్ర యూనిట్ నుంచి వచ్చిన ఈ అప్డేట్ మెగా అభిమానులని ఖుషి చేసింది. ఈ జోష్ ని మరింత పెంచుతూ… సాలిడ్ కిక్ ఇస్తూ చిరు జిమ్ బాట పట్టాడు.
68 ఏళ్ల వయసులో కూడా సినిమా కోసం జిమ్ కి వెళ్లి కసరత్తులు చూస్తే ఈ డెడికేషన్ వల్లే కదా ఆయన మెగాస్టార్ అయ్యింది అనిపించకమానదు. తన సోషల్ మీడియా అకౌంట్స్ లో జిమ్ లో ఎక్సర్సైజులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరు… విశ్వంభర కోసం రెడీ అవుతున్నట్లు చెప్పాడు. ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన చిరు… ఇప్పుడు విశ్వంభరలో కంప్లీట్ కొత్త లుక్ లో కనిపించడానికి రెడీ అవుతున్నాడు. చిరు మామూలుగానే కాస్త ఫిట్ గా ఉంటాడు. ఎప్పుడు ఎక్కువ లావు అయిపోయి కనిపించలేదు. అలాంటిది ఈసారి సాలిడ్ ఫీజిక్ తో కనిపిస్తే మెగా అభిమానులని ఆపడం కూడా కష్టమే. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకోని విశ్వంభర సినిమా 2025 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎలాంటి డిలేస్ లేకపోతే విశ్వంభర సినిమా 2025 జనవరి 10కి ఆడియన్స్ ముందుకొచ్చే రావడం గ్యారెంటీ.