అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : MegaStar : విశ్వంభర స్పెషల్ సాంగ్.. కీరవాణిని కాదని భీమ్స్ కు భాద్యతలు
చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముస్సోరీలో జరుగుతోంది. చిరంజీవి, కేథరీన్ మరియు నయనతార కాంబినేషన్‌లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరు స్కూల్ లో పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. బాలయ్యను కేర్ టేకర్ గా వెంకీ ని కాప్ రోల్ లో చూపించి మెప్పించిన ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు చిరును డ్రిల్ మాస్టర్ గా చూపిస్తున్నారు. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మాస్ మ్యూజిక్ స్పెషలిస్ట్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్. అందుకు అనుగుణంగానే షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య వస్తున్న చిరు – అనిల్ కాంబో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.