మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ట్విట్టర్ నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకూ ఎన్ని చోట్ల ఉన్నా ఏకైక మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ ‘రామ్ చరణ్’. RC 15 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లిన చరణ్, అక్కడ ముందుగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ షోలో పాల్గొన్నాడు. ఆ తర్వాత ABC న్యూస్ ఇంటర్వ్యూకి గెస్టుగా వెళ్లి… “రాజమౌళిని ఇండియన్ స్పీల్బర్గ్” అంటూ సూపర్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. ఇక్కడి నుంచి చరణ్ పేరు సోషల్ మీడియాలో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ రోజు రాం చరణ్ తేజ్, జక్కన్నతో కలిసి ‘బెవర్లీ హిల్స్’లో జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. ఈ ఈవెంట్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా నాలుగు మెయిన్ కేటగిరిల్లో అవార్డులని గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించింది.
HCAలో ‘స్పాట్‌లైట్’ అవార్డును అందుకున్న తొలి భారతీయ నటుడిగా రామ్ చరణ్ తేజ్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రెస్టీజియస్ అవార్డ్ గెలుచుకోవడమే కాదు ‘హాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్’ ఈవెంట్‌లో అవార్డును అందజేసే అవకాశాన్ని అందుకున్న ఏకైక భారతీయ హీరోగా కూడా రామ్ చరణ్ రికార్డులకి ఎక్కాడు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రామ్ ట్వీట్ చేసినట్లు “చరణ్ నిజంగానే గ్లోబల్ స్టార్ ఇమేజ్”ని సొంతం చేసుకున్నాడు. ఫ్యూచర్ లో చరణ్ మరిన్ని హ్యుజ్ ప్రాజెక్ట్స్ చేసి ఇంటర్నేషనల్ ఐడెంటిటీని నిలుపుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.