ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. ఇండియా బౌండరీలని దాటి మరీ చరణ్ గురించి మూవీ లవర్స్ మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. పాన్ ఇండియా సినిమాలు అనే ట్రెండ్ లేక ముందే, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎవరికీ ఎక్కువగా తెలియక ముందే రీజనల్ సినిమాల హద్దుల్ని చెరిపేసే సినిమాలని చేసాడు శంకర్. కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ అద్దడం శంకర్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనగానే… అనౌన్స్మెంట్ తోనే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ బజ్ ని మరింత పెంచుతూ చరణ్ ఓల్డ్ లుక్ లీక్ అవ్వడం, యంగ్ లుక్ లో స్మార్ట్ గా ఉండడం, మధ్యలో ఆఫీసర్ గా సూటు బూటు వేసుకొని చరణ్ కనిపించడంతో… గేమ్ చేంజర్ సినిమా శంకర్ మీటర్ లో ఉంటూ చరణ్ ని ఎలివేట్ చేసేలా ఉంటుందని అందరు నమ్మారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ అప్పటికప్పుడు అప్డేట్స్ బయటకి వచ్చేవి.
ఇలాంటి సమయంలో శంకర్, ఇండియన్ 2 సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టడంతో గేమ్ చేంజర్ సినిమాకి సమస్యలు మొదలయ్యాయి. ఊహించిన దానికన్నా గేమ్ చేంజర్ డిలే అవ్వడం మొదలయ్యింది. సంక్రాంతి నుంచి తప్పిస్తూ గేమ్ చేంజర్ సినిమాని సమ్మర్ కి తీసుకోని వెళ్లారు. ఇప్పుడు సమ్మర్ నుంచి కూడా గేమ్ చేంజర్ తప్పుకుంది అనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉండడంతో మెగా ఫాన్స్ ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నారు. దిల్ రాజుని, ప్రొడక్షన్ హౌజ్ ని, శంకర్ ని టాగ్ చేస్తూ అసలు గేమ్ చేంజర్ సినిమా ఎంతవరకు అయ్యిందో చెప్పండి, అప్డేట్ ఇవ్వండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ నెగటివ్ ట్రెండ్స్ లో ఒకటిగా మారింది. మరి అభిమానుల ఆందోళన చూసిన తర్వాత అయినా గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి.