Meera Antony: కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ ఇంట రెండు రోజుల క్రితం తీవ్ర విషాదం జరిగిన విషయం తెల్సిందే. విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు మీరా ఆంటోనీ ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. 16 ఏళ్ళ వయస్సులో డిప్రెషన్, స్ట్రెస్ తో బాధపడుతూ ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోలీవుడ్ ను మాత్రమే కాదు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని విషాదంలోకి నెట్టేసింది. మీరా.. ఇలాంటి పని చేయడం చాలా బాధాకరమని ప్రముఖులు సైతం బాధపడుతున్నారు. ఇక మీరా సూసైడ్ పై పోలీసులు అనుమానాస్పద కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. అసలు ఆమె చావుకు గల కారణాలు ఏంటి అనే కోణంలో విచారిస్తున్నారు. మీరా ఫ్రెండ్స్, టీచర్స్, కుటుంబ సభ్యులను ఆరాలు తీస్తున్నారు. టీచర్స్ .. మీరా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆమె బరువు ఉన్నాననే ఆత్మన్యూన్యతాభావంతో బాధపడుతున్నట్లు తెలిపారు.
Manchu Lakshmi: సైమా అవార్డుల్లో వ్యక్తిపై చేయి చేసుకున్న మంచు లక్ష్మి..
ఇక చదువు విషయంలో కూడా ఎలాంటి ఒత్తిడి లేదని ఫ్రెండ్స్ , ఫ్యామిలీ చెప్పుకొచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే మీరా సూసైడ్ నోట్ ఆమె పుస్తకంలో దొరికిందని సమాచారం అందుతుంది. అందులో.. “తన స్నేహితులను, టీచర్స్‌ను మిస్ అవుతానని, తన మరణం వల్ల కుటుంబం బాధపడుతుందని రాసుకొచ్చింది. చివర్లో.. లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్ అని రాసింది” ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ గా మారింది. ఇంకోపక్క కూతురు మరణాన్ని విజయ్ తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన గదినుంచి బయటకి రావడం లేదని సమాచారం. మీరా తల్లి ఫాతిమా సైతం గుండెలు పగిలేలా ఏడుస్తూ కనిపించింది. ఆ తల్లిదండ్రులను చూసిన ప్రతి ఒక్కరు కూడా కంటనీరు పెట్టుకుంటున్నారు.