Manchu Lakshmi: మరోసారి మంచు లక్ష్మిపై ట్రోలింగ్.. ఈసారి ఏకంగా వ్యక్తిపై చేసుకుని?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi Slaps a Person on Camera: మంచు మోహన్ బాబు కుమార్తెగా తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి నిర్మాతగా నటిగా సుపరిచితం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం నిర్మాణం కంటే ఎక్కువగా నటన మీద ఫోకస్ పెట్టిన ఆమె ఒక పక్క సినిమాలు, మరో పక్క వెబ్ సిరస్‌లు చేస్తూ మంచు లక్ష్మీ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతూ బిజీగా ఉన్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌గా ఉండే మంచు లక్ష్మి చేసే చేసే పోస్టులన్నీ నిమిషాల వ్యవధిలో వైరలవుతుంటాయి. అయితే ఎందుకు అని అంటే చెప్పలేం కానీ ముందు నుంచి ఆమె మీద అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. ట్రోలింగ్‌ను పట్టించుకోని మంచు లక్ష్మి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు.
Shruti Hasan : ఎయిర్ పోర్ట్ ఘటన గురించి స్పందించిన శృతి హాసన్..
Also Read
ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో కనుక పరిశీలిస్తే లైవ్‌లో ఒక వ్యక్తి మీద చేయి చేసుకుంది మంచు లక్ష్మి. అసలు విషయం ఏమిటంటే కొన్ని రోజులు క్రితం దుబాయ్ వేదికగా సైమా అవార్డుల వేడుక జరిగింది. దక్షిణ భారతదేశానికి చెందిన చాలామంది ఈ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. మంచు లక్ష్మి కూడా సైమా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న క్రమంలో వేదిక బయట మంచు లక్ష్మి మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి కెమెరాకు అడ్డంగా వెళ్లడంతో ఆమె కోపంగా ఆ వ్యక్తి వీపు మీద ఒక్కటిచ్చారు. ఆ తర్వాత కెమరా వైపు తిరిగి మాట్లాడబోతుంటే రో వ్యక్తి అడ్డు వచ్చాడు. దాంతో మంచు లక్ష్మికి కోపంగా డ్యూడ్ కెరాకు అడ్డు రాకుండా ఉండాలనేది మినిమం బేసిక్స్ అంటూ ఫైర్ అయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!