Meenakshi Chaudhary: గురూజీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Chaudhary to act in Trivikram- Allu Arjun Movie: ప్రస్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల ఒక రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఆమె తర్వాత మరో హీరోయిన్ కూడా మెల్లమెల్లగా స్టార్ డమ్ దక్కించుకుంటోంది. నిజానికి సీతా రామం సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమాల్లో బిజీ అవుతువుందని చాలా మంది అనుకున్నా ఆమె చేతిలో నానితో ‘హాయ్ నాన్న’, విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో సిలబస్ లో లేని సబ్జెక్ట్ లా వచ్చి భలే అవకాశాలు దక్కించుకుంటోంది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి సుశాంత్‌తో ‘ఇచ్చట వాహనములు నిలుప రాదు’ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ తర్వాత రవితేజ ‘ఖిలాడీ’లో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అవలేదు. ఆ తరువా ఆమె చేసిన అడివి శేష్ ‘హిట్ 2’ సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది. ‘హిట్: ది సెకండ్ కేస్’ సినిమా ఆమెకు మంచి అవకాశాలు వచ్చేలా చేసింది. అదే సమయంలో మహేష్, త్రివిక్రమ్‌ల ‘గుంటూరు కారం’ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకోవడం ఆమె ఫేట్‌ని మార్చేసింది.
Sunil : మలయాళ నక్క తోక తొక్కిన సునీల్..
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Kannada Beauties : టాలీవుడ్ అంతా కన్నడ భామల వెనుకే!
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
అలా మీనాక్షి సెకండ్ హీరోయిన్ గా ఈ ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టింది. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘గుంటూరు కారం’తో పాటు విశ్వక్ సేన్‌తో #VS 10 సినిమా, దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ అనే పాన్ ఇండియా సినిమా, వరుణ్ తేజ్‌తో మట్కా అనే పాన్ ఇండియా సినిమా అలా మొత్తం మీద మూడు సినిమాలు చేస్తోంది. ఈ లైనప్‌తో ఉన్న మీనాక్షి చౌదరి గురూజీ త్రివిక్రమ్ సెంటిమెంట్ కారణంగా మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టేసినట్టు టాక్ వినిపిస్తోంది. తన సినిమాలో నటించిన హీరోయిన్స్ ను రిపీట్ చేయడం త్రివిక్రమ్ కు ఉన్న సెంటిమెంట్. ఇప్పుడు, ఆమె మరో భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకుంది. అదేమంటే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ భారీ బడ్జెట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తాజా ప్రచారం మేరకు ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఇక ఇదే సినిమాలో సంయుక్త హెగ్డే మరో కథానాయికగా కనిపించనుందని అంటున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం ప్రారంభమవుతుంది, ఇది ఆగస్టు 15, 2024న విడుదల కానుంది, ఇక మరో పక్క ‘గుంటూరు కారం’ జనవరి 12, 2024న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!