Lucky Baskhar: ప్రేక్షకులకు బోర్ కొట్టించొద్దు.. రిస్క్ అనే ఫీలింగే లేదు: మీనాక్షి చౌదరి ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా,మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించారు మీనాక్షి చౌదరి.
లక్కీ భాస్కర్ ఎలా మొదలైంది?
గుంటూరు కారం తర్వాత సితార ఎంటెర్టైన్మెంట్స్ లో ఇది నా రెండో సినిమా. ఈ మంచి సినిమాలో భాగం కావడం సంతోషం. బాగా ప్రిపేర్ అయ్యి ఈ సినిమాని ప్రారంభించడం గొప్ప విశేషం. అందువల్ల నాది, దుల్కర్ గారిది తెలుగు మాతృభాష కానప్పటికీ మేము ఒక్కరోజు కూడా ఇబ్బంది పడలేదు. దుల్కర్ సల్మాన్ గారు గొప్ప నటుడు. అలాగే మంచి మనిషి. ఆయనతో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
పాత్ర కోసం హోంవర్క్
డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో, అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దాని చుట్టూ ఈ కథ తిరుగుతుంది. నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించా. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయా, ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు చేరువవుతుందనే నమ్మకం ఉంది.
కెరీర్ స్టార్టింగ్ లో తల్లి పాత్ర రిస్క్ అనిపించలేదా?
మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే మంచి కథలు చేయాలి, మంచి టీంతో పని చేయాలి. వయసుకు తగ్గ పాత్రలే చేయాలని పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే నటీనటులకు కాదు, ప్రేక్షకులకు కూడా బోర్ కూడా కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపించాలని అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టుగానే సినిమాలు ఎంచుకుంటున్నాను.
సుమతి పాత్ర ఎలా ఉండబోతుంది?
భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బ్రతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకునే స్వభావం తనది. అయితే దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి కథలు వస్తాయని భావిస్తున్నాను.
కథ విన్న తర్వాత మొదట మీకు ఏమనిపించింది?
బ్యాంకింగ్ నేపథ్యంలో కొన్ని సిరీస్ లు వచ్చాయి. కానీ కుటుంబ భావోద్వేగాలను ముడిపెడుతూ వెంకీ అట్లూరి ఈ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది. ఎమోషన్స్ తో కూడిన ఒక బ్యూటిఫుల్ జర్నీ ఈ మూవీ. అలాగే నా పాత్ర కూడా నాకు బాగా నచ్చింది.
చైల్డ్ ఆర్టిస్ట్ రిత్విక్ గురించి?
నేను చూసిన ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ లలో రిత్విక్ ఒకడు. ఎంతో ప్రతిభ ఉంది. డైలాగ్ లు మర్చిపోకుండా చెబుతాడు. ఎక్స్ ప్రెషన్స్ కరెక్ట్ గా ఇస్తాడు. అతనికి ఎంతో మంచి భవిష్యత్ ఉంది.
ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి కదా.. దీనిపై మీ స్పందన?
ఇది కథా బలమున్న సినిమా. అందుకే సినిమాపై ముందు నుంచి మేమందరం ఎంతో నమ్మకంగా ఉన్నాము. ట్రైలర్ విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి మా నిజమవుతుందని ఆనందం కలిగింది.
సాంకేతికంగా సినిమా ఎలా ఉండబోతుంది?
సాంకేతిక విభాగం అద్భుతంగా పనిచేసి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. జి.వి. ప్రకాష్ సంగీతం చాలా బాగుంటుంది. అలాగే కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ ప్రతిదీ అద్భుతంగా ఉంటాయి.
దుల్కర్ సల్మాన్ గురించి?
ఆయన ఎంత గొప్ప నటుడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించారు. భాస్కర్ పాత్రకు ఏం కావాలో అది చేసి, కథని భుజాలపై నడిపించారు. అలాగే తెలుగు మాతృభాష కానప్పటికీ, సంభాషణలు నేర్చుకొని చక్కగా చెప్పారు. మమ్మూట్టి కొడుకు అయినప్పటికీ విభిన్న పాత్రలు ఎంచుకుంటూ, తనదైన నటనతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పూర్తిగా ఒదిగిపోతారు దుల్కర్ గారు. భాస్కర్ పాత్రలో కూడా అలాగే ఒదిగిపోయారు.
లక్కీ భాస్కర్ ఎలా ఉండబోతుంది?
ఎమోషన్స్ బాగుంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయి. చూసిన ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుతుంది. ఇదొక కామన్ మ్యాన్ కథ. అందరికీ నచ్చుతుంది.
తాజావార్తలు
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!