Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మల్టీట్యాలెంటెడ్ హీరో అన్న విషయం తెల్సిందే. సింగర్ కమ్ డ్యాన్సర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. అన్నింటిలోనూ ధనుష్ సక్సెస్ సాధించాడు. ఇక ప్రస్తుతం ఈహీరో వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఇటీవలే తెలుగులో సార్ సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకొని ఔరా అని అనిపించుకున్నాడు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ జూనియర్ లెక్చరర్ గా కనిపించగా.. ఆయన్ను ప్రేమించే బయోలజీ టీచర్ గా సంయుక్త మీనన్ నటించింది.
Chandramukhi2: అమ్మ బాబోయ్.. లారెన్స్ ఈసారి గట్టిగా భయపెట్టేలా ఉన్నాడే
ఇక సినిమాకు హైలెట్ అంటే జీవి ప్రకాష్ సంగీతం అని చెప్పాలి. ముఖ్యంగా మాస్టారు మాస్టారు సాంగ్ ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సాంగ్ ను ప్రతి వేడుకలో ధనుష్ ఈ సాంగ్ ను ఆలపించాడు. దీంతో ధనుష్ వాయిస్ కు అభిమానులు ఫిదా అయిపోయారు.ధనుష్ కు సాంగ్స్ పాడడం కొత్తేమి కాదు. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మాస్టారు మాస్టారు సాంగ్ మేల్ సాంగ్ ను ధనుష్ తో పాడించి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా ధనుష్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు. ఈ సాంగ్ విన్నవారందరు..వ్వా.. ఏం పాడవయ్యా.. నీ గొంతులో ఉన్న మ్యాజిక్ కు ఫిదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.