మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న విడుదల కానున్న ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది.
మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఆశించే అన్ని అంశాలు ‘మాస్ జాతర’ టీజర్ లో ఉన్నాయి. నిజానికి అభిమానులు ఆశించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. రవితేజ శైలి యాక్షన్ మరియు వింటేజ్ ఎనర్జీతో నిండిన ఫుల్ మీల్స్ మాస్ ఎంటర్టైనర్ ను చూడబోతున్నామనే హామీని టీజర్ చూస్తే తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పాటు వినోదాన్ని మేళవిస్తూ టీజర్ ను మలిచిన తీరు ఆకట్టుకుంది. అభిమానులు కోరుకునే అసలుసిసలైన మాస్ రాజా తెరపై ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. రవితేజ తనదైన చురుకుదనం, కామెడీ టైమింగ్ తో కట్టిపడేశారు. శ్రీలీల మరోసారి డాన్స్ లతో అలరించనుంది. రవితేజ, శ్రీలీల ఎప్పుడు తెరను పంచుకున్నా అది స్వచ్ఛమైన మాయాజాలానికి హామీ ఇస్తుంది. ‘మాస్ జాతర’ టీజర్ లో ఈ జోడి మరోసారి మాయ చేసింది. దర్శకుడు భాను భోగవరపు మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా మెచ్చే విధంగా అసలైన పండుగ సినిమాలా ‘మాస్ జాతర’ను మలుస్తున్నారు. వినాయక చవితి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం పండుగ ఉత్సాహాన్ని మరింత పెంచనుంది.