సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లోనే కాదు యూఎస్ఏలోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన నటించిన అన్ని సినిమాలు USA బాక్సాఫీస్ వద్ద దాదాపు మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేశాయి. అయితే మహేష్ గత కొంతకాలం నుంచి తన సినిమాలకు మార్వెల్ ముప్పును ఎదుర్కొంటున్నాడు. 2018లో మహేష్ “భరత్ అనే నేను”, మార్వెల్ స్టూడియోస్ “అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్” దాదాపు అదే సమయంలో తెరపైకి వచ్చాయి. ఫలితంగా “భరత్ అనే నేను” మూవీ USA బాక్సాఫీస్ వద్ద భారీ సంఖ్యలో వసూలు చేయడంలో విఫలమైంది. 2019లో మహేష్ “మహర్షి” చిత్రానికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. “మహర్షి” విడుదలైన సమయంలోనే “ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్” కూడా విడుదలైంది. మళ్ళీ అదే పరిస్థితి.
Read Also : Akhil: ఎట్టకేలకు బ్రేకప్ పై నోరువిప్పిన అఖిల్
ఇక ఇప్పుడు మరోసారి మహేష్ మార్వెల్ ముప్పును ఎదుర్కొన్నాడు. మహేష్ నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు మార్వెల్ “డాక్టర్ స్ట్రేంజ్: మ్యాడ్‌నెస్ ఆఫ్ ది మల్టీవర్స్” తెరపైకి వస్తోంది. హాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “డాక్టర్ స్ట్రేంజ్” ఒకటి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన స్పందన వస్తుందనడంలో అలన్తి సందేహం లేదు. దాదాపు ఇండియాలో కూడా ఈ మూవీ గురించి సూపర్ హీరో మూవీని ఇష్టపడే ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మే 6న దేశవ్యాప్తంగా ప్రధాన భాషల్లో విడుదల కానుంది. సినిమా ప్రేక్షకులను మెప్పించిందంటే ఇక్కడి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా “డాక్టర్ స్ట్రేంజ్” సునామీని సృష్టిస్తాడు. ఆ తరువాత వారం కూడా గ్యాప్ లేకుండానే మహేష్ థియేటర్లలో సందడి చేయనున్నారు. అయితే “సర్కారు వారి పాట”పై “డాక్టర్ స్ట్రేంజ్” ప్రభావం తప్పకుండా కొంతైనా పడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు. మరి మహేష్ “డాక్టర్ స్ట్రేంజ్”ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.