వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తన మొదటి సినిమా నుంచి కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మరోవైపు యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తోంది.
మరో పక్క ‘3 రోజెస్’ అనే వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తున్నాడు మారుతి. యస్.కె. యన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘3 రోజెస్’ సీజన్ 1 కు సంబందించిన పోస్టర్ ను విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.