Naresh- Pavitra: సీనియర్ నటుడు నరేష్- పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నారా..? ఇదే ప్రశ్నకు సమాధానం కోసం గత ఏడాదిగా మీడియాతో పాటు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేశాడు నరేష్. నరేష్, పవిత్ర జంటగా ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర మళ్లీ పెళ్లి. నరేష్ స్వయంగా ఈ సినిమాను నిర్మిసున్నాడు. తన జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ముందుగానే చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే టీజర్, ట్రైలర్ కూడా ఉండడంతో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈరోజు రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే అలరించిందని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నరేష్ కు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి అనుకున్నారో.. అవే ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా మీకు పెళ్లి జరిగిందా అన్న ప్రశ్నకు.. నరేష్ సమాధానం చెప్పేశాడు.
Janhvi Kapoor: ఎన్టీఆర్ మనవడితోనే ఇంకా అవ్వలేదు.. ఏఎన్నార్ మనవడితోనా..?
“కొంతమంది తాళి కట్టి పెళ్లిచేసుకుంటారు.. ఇంకొంతమంది రింగులు మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది మతం మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. నా దృష్టిలో పెళ్లి అంటే.. ఇద్దరు మనసుల కలయిక.. మా మనసులు కలిశాయి.. యూనియన్ ఆఫ్ హార్ట్స్.. మాది అదే ” అని చెప్పుకొచ్చాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా పెళ్లి చేసుకున్నాం.. బయటికి చెప్పలేం అని చెప్పాడు. అందుకు కారణం.. నరేష్.. తన మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వలేదు. విడాకులు ఇవ్వాలని నరేష్ ప్రయత్నిస్తున్నా.. ఆమె అందుకు ఒప్పుకోవడం లేదు. అందుకే వీరి పెళ్లి ఇంకా బహిరంగం కాలేదు. ఆ విడాకులు వచ్చిన తెల్లారే తాము పెళ్లి చేసుకున్నామని చెప్తారు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.