Market Mahalakshmi trailer : కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు.వినూత్న ప్రమోషన్లతో సినిమా సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ మార్కెట్ మహాలక్ష్మి ట్రైలర్ రిలీజ్ చేశారు. “మార్కెట్ మహాలక్ష్మి” ట్రైలర్ ఒక తండ్రి తన కొడుక్కి పెళ్లి, కట్నం కోసమే చేయాలనుకోవడంతో మొదలవుతుంది. తండ్రి కొడుకుకి పెళ్లి ప్రపోజల్స్ తీసుకురావడం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన పార్వతీశం వాటిని తిరస్కరించడం సాగుతూ ఉంటుంది.
ఇలా సాగుతూ ఉండగా ఒక రోజు మార్కెట్లో మహాలక్ష్మిని చూసి ప్రేమలో పడ్డ హీరో ఆ తర్వాత తనని ఇంప్రెస్ చేయడానికి జరిగిన సిచువేషన్స్, కష్టాలు, చివరికి వీరేలా కలిశారన్నదే మిగతా కథ. ట్రైలర్‌లో ఆసక్తికరమైన “వర్క్ ఫ్రమ్ మార్కెట్” కాన్సెప్ట్‌ను మేకర్స్ పరిచయం చేశారు. ఇక ట్రైలర్ లోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ డీసెంట్ గా ఉన్నాయి. ఈ సింపుల్ ట్రైలర్ ఒక మంచి ఫన్ ఫిలిం అని అర్ధమయ్యేలా చేస్తోంది. ఇక ఎమోషన్, ఫన్, సింపుల్ మూమెంట్స్‌తో కూడిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. పార్వతీశం – ప్రణికాన్విక మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లో విడుదల కాబోతుందని మేకర్స్ చెబుతున్నారు.