Market Mahalakshmi Producer Akhilesh Kalaru Interview: బి2పి స్టూడియోస్ బ్యానర్ లో కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా ప్రణీకాన్వికా హీరోయిన్ గా నటిస్తున్న ‘మార్కెట్ మహాలక్ష్మి’ ఏప్రిల్ 19న థియేటర్ లో రిలీజ్ కానుంది. ముఖేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ ఉండగా, ఈ క్రమంలో ప్రొడ్యూసర్ అఖిలేష్ కలారు మీడియాతో ముచ్చటించి సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. తాను ఇండియానాపోలిస్, USలో ఉంటున్నానని & ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒకదానిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నానని అన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. సినిమా పరిశ్రమలో పనిచేయాలని అనుకున్నా, ఫ్యామిలీ కమిట్‌మెంట్‌ల కారణంగా, నేను మొదట ఆ బాధ్యతలను పూర్తి చేసి, ఆపై నా అభిరుచిని కొనసాగించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
దర్శకుడు ముఖేష్ రెండేళ్లుగా తెలుసు, ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడో తెలుసు, “మార్కెట్ మహాలక్ష్మి” కథను ఆయన చెప్పినప్పుడు, నేను దానిని ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నా, రిస్క్ లేని వ్యాపారం లేదు. దర్శకుడు ముఖేష్ స్క్రిప్ట్‌ని నమ్మి ఆ రిస్క్ నేను తీసుకున్నా. “మార్కెట్ మహాలక్ష్మి” కథ చాలా సింపుల్ ఎందుకంటే ఓ ఇండిపెండెంట్ అమ్మాయి, సాఫ్ట్‌వేర్ అబ్బాయి మధ్య సాగే ప్రేమకథ ఇది. మేము మా ప్రమోషన్‌లలో ఒక మెయిన్ పాయింట్ నీ చెప్పలేదు, అయితే ఆ పాయింట్ 19వ తేదీన ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుందని ఆశిస్తున్నాం. సినిమాలో నటీనటులు తమ పాత్రలకు 100% న్యాయం చేశారు. పార్వతీశం – ప్రణీకాన్విక ఇద్దరూ తమ పాత్రల్లో జీవించారు, వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద నటీనటులతో ఈ సినిమా చేస్తే బాగుండేదని నాకెప్పుడూ అనిపించలేదు. దర్శకుడు ముఖేష్ నాకు చెప్పిన కథనే తెరపైకి తెచ్చారు. ముఖేష్ కథ చెప్పినప్పుడు నేను వారి పాత్రలను విజువలైజ్ చేసుకున్నా, ఫైనల్ గా సినిమా చూసాక, నేను ఊహించిన వాటిని తెరపై చూసినట్టు అనిపించింది.