తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనుదీప్ కె.వి. ఈ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. అయితే సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయం మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కథ యూకే లోని లండన్ నేపథ్యంలో జరుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే తాజాగా సోషల్ మీడియాలో ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది.
Read Also : FIR Controversy : విష్ణు విశాల్ కు షాక్… తెలంగాణాలో బ్యాన్ కు డిమాండ్
శివకార్తికేయన్ సినిమాలో హీరోయిన్ గా ఓ హాలీవుడ్ భామ నటించబోతోందని తాజా టాక్. “SK 20” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఉక్రెయిన్ భామ మరియా ర్యాబోశాప్క కథానాయికగా కనిపించనుందని టాక్. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ బ్యూటీ ఒలివియా మోరిస్ ను మేకర్స్ సంప్రదించినట్టు టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో మరియా ర్యాబోశాప్క చేరిపోయింది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే మేకర్స్ హీరోయిన్ ఎవరన్న విషయాన్నీ అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.