Manushi Chhillar Dating Nikhil Kamath: బాలీవుడ్ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాల గురించి అందరికీ తెలిసిందే! సీక్రెట్స్ ఏం దాచుకోరు.. తాము ఎవరితోనైనా ఎఫైర్‌లో ఉంటే, ఓపెన్‌గానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు. ఇప్పుడు మాజీ మిస్ వరల్డ్, నటి మానుషీ ఛిల్లర్ కూడా ఓ పెళ్లైన వ్యక్తితో డేటింగ్‌లో ఉందని సమాచారం. అతని పేరు నిఖిల్ కామత్. ఇతను జీరోధా సంస్థ వ్యవస్థాపకుడు. ఇతనికి 2019లోనే ఒక మహిళతో వివాహం అవ్వగా, గతేడాదే ఆమెకు విడాకులు ఇచ్చాడు. మనస్పర్థల కారణంగానే వాళ్లు విడిపోయారు. అయితే.. నిఖిల్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి ముందే మానుషీతో సాన్నిహిత్యంగా ఉంటూ వస్తున్నాడు. 2021 నుంచి వీళ్లు తరచూ విహారయాత్రలకు వెళ్తున్నారని కూడా తాజాగా బట్టబయలైంది.
ఇన్నాళ్లూ మానుషీ, నిఖిల్ గుట్టుచప్పుడు కాకుండా, కెమెరా కంటికి చిక్కకుండా తమ ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు. కొన్నిసార్లు చిక్కినప్పటికీ, వీరి మధ్య పప్పులు ఉడుకుతున్న సంగతిని అప్పుడు ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. అయితే.. ఈమధ్య వీళ్లు బాగా ఓపెన్ అయిపోయారు. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తున్నారు. ఇటీవల ఈ జంట ఓ పూజ చేస్తూ.. కెమెరాకి చిక్కారు. వీళ్లు ప్రేమలో ఉన్నారన్న వార్తలకు ఆ వీడియో మరింత బలం చేకూర్చింది. ఇక మానుషీ అఫీషియల్‌గా తన ప్రేమ గురించి వెల్లడించడమే మిగిలింది. మరో ట్విస్ట్ ఏమిటంటే.. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు కూడా తెలుసట! చూస్తుంటే.. వీరి ప్రేమ పెళ్లి పీటలదాకా వెళ్లేటట్లు కనిపిస్తోంది. కాగా.. మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించిన మానుషీ, పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అయితే, ఈమెకు మరీ విపరీతమైన ఆఫర్లైతే రావట్లేదు. అందుకేనేమో, వ్యక్తిగత జీవితంలో సెటిలవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.