Manoj : మంచు మనోజ్ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సారి తన అన్న ఏమీ అనలేదు. తండ్రితో ఎలాంటి గొడవ జరగకున్నా.. మనోజ్ కంటతడి పెట్టుకున్నాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన మూవీ భైరవం. మొదటి నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో మనోజ్ స్పెషల్ ఏవీని ప్రదర్శించారు. అది చూసిన మనోజ్ స్టేజి మీదనే కెమెరాల ముందు కంటతడి పెట్టుకున్నాడు. ఈ రోజుల్లో తన ఇంట్లో వారే తనను వేధిస్తుంటే.. అభిమానులు మాత్రం ఎలాంటి సంబంధం లేకపోయినా ఇంత ఆదరిస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యాడు.
Read Also : Shahzad: మరో పాక్ గూఢచారి షాజాద్ అరెస్ట్
‘ఏడేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాను. ఇంత గ్యాప్ వచ్చినా సరే నా మీద అభిమానం తగ్గలేదు. ఇదే నాకు కావాల్సింది. నా ఇంట్లో వారే నన్ను కష్టపెడుతున్నారు. అయినా నేను బాధపడట్లేదు. నాకు మీరంతా ఉన్నారు. నా తండ్రి నాకు నేర్పించిన క్రమశిక్షణ నన్ను పోరాడేలా చేస్తోంది. ఈ కట్టె కాలే వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే. ఆయన చూపించిన మార్గంలోనే నడుస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు మనోజ్. ఆయన ఎమోషనల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Retro : రెట్రో కలెక్షన్లు.. సూర్య కెరీర్ లోనే హయ్యెస్ట్..