Manjummel Boys Movie OTT Update: మలయాళ సినిమా చరిత్రలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి చిత్రం మంజుమ్మెల్ బాయ్స్. కేరళ మాత్రమే కాకుండా తమిళనాడు, కర్నాటకలో ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలై నెల రోజులు కావస్తున్న ఈ సినిమా OTT విడుదల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. థియేటర్‌లో హిట్ అయిన ఈ సినిమాను మరోసారి చూసేందుకు చాలా మంది సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే విడుదలకు ముందు మంజుమ్మాళ్ బాయ్స్ OTT హక్కులను ఎవరూ సొంతం చేసుకోలేదు. కంటెంట్ పోతుందో పోదో అని OTT లు ఈ సినిమాను కొనుక్కోలేదని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రావడంతో మంజుమ్మెల్ బాయ్స్ యొక్క OTT హక్కుల కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు క్యూ కడుతన్నాయి. సౌత్ ఇండియన్ సినిమాల ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై షేర్ చేసిన సమాచారం ప్రకారం, స్టార్ నెట్‌వర్క్ మంజుమ్మల్ బాయ్స్ యొక్క OTT – శాటిలైట్ హక్కులను పొందిందని,కాబట్టి మంజుమ్మల్ బాయ్స్ యొక్క OTT విడుదల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా జరుగుతుందన్నీ అంటున్నారు. అయితే తెలుగు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి రిలీజ్ లేట్ అవచ్చు.
S Jaishankar: ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదు.. పాక్‌పై విదేశాంగ మంత్రి మండిపాటు
అయితే ఈ నివేదికలకు సంబంధించి చిత్ర బృందం లేదా OTT ప్లాట్‌ఫాం ధృవీకరించలేదు. మలయాళ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మంజుమ్మల్ బాయ్స్ నిలిచింది. గతేడాది విడుదలైన 2018 చిత్రం 175 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసిన మంజుమ్మల్ బాయ్స్.. 19వ తేదీన 200 కోట్ల క్లబ్‌లో చేరింది. నివేదికల ప్రకారం ఈ సినిమా నిర్మాణ వ్యయం దాదాపు 20 కోట్లు. మలయాళంలో సూపర్ స్టార్లు లేకుండానే ఓ సినిమా అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. మంజుమ్మాళ్ బాయ్స్ ఇప్పటివరకు తమిళనాడు బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. తమిళనాట బాక్సాఫీస్ వద్ద ఇంత భారీ ఫీట్ సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి. అలాగే ఈ సినిమాకి కన్నడ బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన వస్తోంది. కర్ణాటక నుంచి ఇప్పటివరకు ఈ సినిమా వసూళ్లు 10-15 మధ్య ఉన్నాయి. కర్ణాటక నుంచి మలయాళ సినిమాకి ఇదే అత్యధిక కలెక్షన్‌గా నిలిచింది. మంజుమ్మల్ బాయ్జ్ చిదంబరం రచన మరియు దర్శకత్వం వహించిన సర్వైవల్ థ్రిల్లర్. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, చంతు సలీంకుమార్, అభిరామ్ రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, ఖలీద్ రెహమాన్, అరుణ్ కురియన్ మరియు విష్ణు రఘు ప్రధాన పాత్రలు పోషించారు.