Manjummel Boys becomes first Malayalam Movie to Cross 200 Crores: మలయాళ సినిమా చరిత్రలో 200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా ‘మంజుమ్మేల్ బాయ్స్’ నిలిచింది. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచి విశేష స్పందన లభించింది. మలయాళంతో పాటు తమిళనాట కూడా ఈ సినిమాకు అక్కడి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తమిళ డబ్బింగ్ లేకుండానే తమిళనాడులో యాభై కోట్లు వసూలు చేసిన తొలి పర భాషా చిత్రంగా కూడా మంజుమ్మేల్ బాయ్స్ రికార్డు సృష్టించింది. కేరళలోని థియేటర్ల నుంచి 60 కోట్లు రాబట్టింది. రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 68 కోట్లు. కర్ణాటక నుంచి 11 కోట్లు రాబట్టి మొత్తం మీద మంజుమ్మేల్ బాయ్స్ 200 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక సినిమా డబ్బింగ్ వెర్షన్లు కూడా విడుదలయ్యే అవకాశం ఉండడంతో కలెక్షన్స్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కాలంగా నంబర్ వన్‌గా నిలిచిన జడ్ ఆంథోని చిత్రం ‘2018’ రికార్డును కూడా మంజుమ్మల్ బాయ్స్ సృష్టించింది. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ‘2018’ కలెక్షన్ 175 కోట్లు. ‘మంజుమ్మేల్ బాయ్స్’
Actor Viraj: ‘అపరిచితుడు’ బుడ్డోడు ఒక స్టార్ హీరో బావమరిది.. ఎవరో తెలుసా?
ఈ కలెక్షన్స్ ను 25 రోజులలో దాటేసింది. ఇక పులిమురుగన్, లూసిఫర్, ప్రేమలు ఇతర మలయాళ చిత్రాలు బెస్ట్ కలెక్షన్స్ తో టాప్ ఫైవ్ లో ఉన్నాయి. మంజుమ్మల్ బాయ్స్ ఫిబ్రవరి 22న విడుదలైంది. చిదంబరం దర్శకత్వం వహించిన మంజుమ్మేల్ బాయ్స్ చిత్రానికి మొదటి రోజు నుంచే అద్భుతమైన మౌత్ పబ్లిసిటీ వచ్చింది. కేరళతో పాటు తమిళనాడులో కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. మంజుమ్మేల్ బాయ్స్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల కానుండడంతో ఆ కలెక్షన్స్ మరింత పెరగొచ్చు. ఇక అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల కలెక్షన్ (సుమారు రూ. 8 కోట్లు) సాధించిన తొలి మలయాళ చిత్రంగా కూడా మంజుమ్మేల్ బాయ్స్ రికార్డు సృష్టించింది. ఇది మలయాళ సినిమాకి గర్వకారణం అని అక్కడి వారు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాకి తమిళనాడులో లభించని ఆదరణ మంజుమ్మేల్ బాయ్స్ కు లభిస్తోంది. ఈ సినిమాలో గుణకేవ్‌తో పాటు తమిళ నేపథ్యం ఉండటంతో అక్కడి వారు కూడా థియేటర్లకు ఎగబడ్డారు.