Manjima Mohan: సాహసమే శ్వాసగా సాగిపో చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది మంజిమా మోహన్. నాగ చైతన్య సరసన కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది. గత కొన్నేళ్ల నుంచి మంజిమా, కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం విదితమే. అయితే ఈ రూమర్స్ పై గౌతమ్ స్పందించలేదు కానీ మంజిమా మాత్రం ఘాటుగానే స్పందించింది. ఈ వార్తలు తనను ఎంతో బాధపెడుతున్నాయని, తన కుటుంబం కూడా తన వలన బాధపడడం నాకు ఇష్టం లేదని, దయచేసి ఇలాంటి పుకార్లను పుట్టించవద్దని ఏడ్చినంత పనిచేసింది. ఇక దీంతో వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం కేవలం రూమర్స్ మాత్రమే అని నెటిజన్లు అనుకున్నారు. ఇక ఇప్పుడు మాత్రం అదే హీరోతో ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చింది. గౌతమ్ ను కలిసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, అలంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం తాను చేసుకున్న అదృష్టమని చెప్పుకొచ్చింది.
ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ జంట దేవరాట్టం అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక గౌతమ్ ఎవరో కాదు సీతాకోక చిలుక, అన్వేషణ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కార్తీక్ తనయుడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం కూడా తెలుపడంతో త్వరలోనే వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ జంట తమ ప్రేమను అధికారికంగా వెల్లడి చేయడంతో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.