True lover : “ట్రూ లవర్”గా మారిన “గుడ్ నైట్” హీరో.. మరో బేబీ లోడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో హీరోగా కొన్ని సినిమాలు చేసిన మణికందన్ గుడ్ నైట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యాడు. గురక కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో మంచి హిట్ అయింది. దాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ తెలుగులో డబ్ చేసి ఆన్లైన్ లో స్ట్రీమ్ చేసింది. ఇప్పుడు మణికందన్ హీరోగా తెలుగు అమ్మాయి గౌరీ ప్రియా రెడ్డి హీరోయిన్ గా తమిళంలో లవర్ అనే సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాని ముందుగా తమిళంలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సినిమా చూసిన తర్వాత మారుతి తన స్నేహితుడు ఎస్కేఎన్ తో కలిసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో లవర్ గా తెలుగులో ట్రూ లవర్ గా ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది.. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఇది ఒక లవ్ స్టోరీ లాగానే కనిపిస్తుంది.
Also Reaad; Hanuman: జీ 5లోకి హనుమాన్.. ఎప్పటి నుండి స్ట్రీమ్ కానుందంటే?
Also Read
కాలేజీలో మొదలైన లవ్ స్టోరీ ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులకు లోబడి ఎలాంటి టర్న్స్ తీసుకుంది అనే విషయాన్ని టీజర్ లో కట్ చేసి చూపించాను. అయితే సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ టీజర్ చూస్తుంటే మాత్రం మరొక బేబీ సినిమా లోడింగ్ అన్నట్లుగానే కనిపిస్తుంది. ప్రియుడు, ప్రియురాలి మధ్య మూడో వ్యక్తి రావడం. అతని ఇంటెన్షన్స్ తప్పు అని ప్రియుడు ప్రియురాలికి చెప్పడం అందుకు ఆమె ఒప్పుకోకపోవడం లాంటివన్నీ చూస్తుంటే ఎందుకో బేబీ సినిమా లాగానే అనిపిస్తుంది.. ప్రభురామ్ వ్యాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని తమిళంలో గుడ్ నైట్ సినిమా ప్రొడ్యూస్ చేసిన నిర్మాతలే ప్రొడ్యూస్ చేయటం ఆసక్తి కరం. ఫిబ్రవరి 9వ తేదీన అటు తమిళంలో ఇటు తెలుగులో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ మీరు కూడా చూసేయండి. మీ అభిప్రాయం అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!