Kamal Hasan : కమల్ హాసన్ ఈ వయసులో కూడా వరుసగా సినిమాలు తీస్తున్నారు. యాక్షన్ సీన్స్ లోనూ ఇరగదీస్తున్నారు. తాజాగా నటించిన మూవీ థగ్ లైఫ్. జూన్ 5న రాబోతోంది. మణిరత్నం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో త్రిష, శింబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ ఓ రేంజ్ లో రొమాన్స్ కూడా చేశాడు. 28 ఏళ్ల వయసున్న అభిరామితో ఏకంగా లిప్ లాక్ చేశాడు. అలాగే 42 ఏళ్ల వయసున్న త్రిషతో రొమాంటిక్ సీన్లలో కూడా నటించేశాడు. వీటిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.
Read Also : Heavy Rains: రేపు, ఎల్లుండి జాగ్రత్త..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
కమల్ హాసన్ ఈ వయసులో కూడా ఇలాంటివి చేయడం ఏంటని మండిపడ్డారు నెటిజన్లు. అయితే వాటిపై తాజాగా మణిరత్నం స్పందించారు. ‘ఇలాంటివి ఇప్పుడు కొత్తేం కాదు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. సినిమాలో చేసిన వాటిని కొందరు సమర్థించవచ్చు. ఇంకొందరు విమర్శించవచ్చు. అది సహజం. ప్రతి దాన్ని నిజ జీవితపు కోణంలో చూడలేం కదా.
అలా చూస్తే నిజ జీవితంలోనే ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. కానీ సినిమాలో వాళ్ల పాత్రలు మాత్రమే చూడాలి. ఆ పాత్రల్లో నటించిన వారి వయసులు కాదు. అందులో ఉన్నది కమల్ హాసన్, త్రిష అని కాకుండా.. ఆ పాత్రల వరకు మాత్రమే సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. అంతకు మించి ఇంకేం చర్చించినా దానికి సమాధానాలు దొరకడం చాలా కష్టం అవుతుంది’ అంటూ తెలిపారు మణిరత్నం.
Read Also : Samantha : యమ హాట్ గా సమంత ఫోజులు..